తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 04కి వాయిదా పడింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం పై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సీట్‌ని కొనసాగించాలా లేక సీబీఐ తరహాలో దర్యాప్తు అవసరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సోలి సిటర్ జనరల్ తుషార్ మోహతా అభిప్రాయం కోరింది. తమ అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను రేపు కొనసాగిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.