Tuesday, April 15, 2025
spot_img

రాజ్యాధికార సాధననే బీసీలకు అంతిమ లక్ష్యం కావాలి

Must Read
  • ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం..
  • అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు
  • ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి నగేష్ నియామకం..
  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్

కులగణనతో తెలంగాణాలో సామాజిక విప్లవం మొదలయ్యిందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు.. బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి ముంజాల రాజేందర్ గౌడ్ నేతృత్వంలో ఆదివారం హరిత కాకతీయ వద్ద నిర్వహించిన ములుగు ముఖ్య నాయకుల సమావేశానికి దాసు సురేశ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను, క్షేత్రస్థాయి స్థితిగతులను ముఖ్య నాయకులు విశ్లేషించారు.. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఫార్ములా 21ను అనుసరించి అన్ని కొత్త జిల్లాల్లో, నియోజక వర్గాలలో, మండలాలలో ప్రతీ యూనిట్ లో 21 మంది ముఖ్యులతో స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలని, కార్యవర్గ నిర్మాణం పూర్తయిన వెంటనే క్యాడరుకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు..

తదనంతరం దాసు సురేశ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పర్యటనలను విజయవంతంగా పూర్తిచేసి సంభందిత కమిటీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఈ ప్రక్రియకు కొనసాగిoపుగా నూతన జిల్లాల పర్యటనను ఈ రోజు నుండి ములుగు జిల్లా నుండి ప్రారంభింస్తున్నట్లు దాసు సురేష్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి నగేష్ ను నియమించటము జరిగింది. తథనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున బీసీ నాయకుల గెలుపు దిశగా తమ భవిష్యత్ కార్యాచరణను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైద్య రాజగోపాల్, పెద్ద కాసు కుమారస్వామి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుకొండ హైమావతి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్, ఉత్తర తెలంగాణ ఇన్చార్జి బుర్ర కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడుపు గంటి శ్రీధర్, హన్మకొండ మండల ఇన్చార్జి గోవిందుల జనార్ధన్, వంగ రవి, రామగిరి యాదగిరీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest News

పార్క్‌ హయత్‌లో అగ్నిప్రమాదం

క్రికెటర్లకు తప్పిన ముప్పు వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS