- డబ్బులు ఇవ్వాలి లేదంటే అంతుచూస్తామంటూ మేసేజెస్
- మాజీ సోషల్‌మీడియా అకౌంట్స్ చూసే వ్యక్తిపై ఫిర్యాదు
ప్రముఖ సినీనటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను ఓ వ్యక్తి బెదిరించారు. వివరాల ప్రకారం చందక్రిరణ్‌రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపుతులను బెదిరించినట్లు విజయశాంతి భర్త శ్రీనివాస్ శనివారం నాడు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. గతంలో విజయశాంతి బీజేపీలో పనిచేసిన సమయంలో చంద్రకిరణ్‌రెడ్డి అమె సోషల్ మీడియా అకౌంట్స్‌ను చేసుకునే వారని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో అమె కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో చంద్రకిరణ్‌రెడ్డిని అమె పక్కకు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తనకు డబ్బులు చెల్లించాలని లేదంటే మీ అంతుచూస్తామని చంద్రకిరణ్‌రెడ్డి విజయశాంతికి తరుచు బెదిరింపు మేసేజస్ పెడుతున్నట్లు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.