మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను తొలగించి, శాంతిని నెలకొల్పే సాధనాలు. మూడు భాషలు నేర్చుకోవడం అనేది జీవితానికి ఒక విజయవంతమైన యాత్ర.
- గుమ్మడిదారి సాయికృష్ణ