ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయింత్రం 4 గంటలకు పీఎస్ఎల్వి- సీ 59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. బుధవారం సాయింత్రం 04.08 గంటలకు పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం నిర్వహిస్తారు.