- ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి
- పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం
- నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా పలు కీలక సూచనలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకమని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్కీంలను జనాల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని నాయకులంతా గ్రౌండ్ లెవల్ మరింత కష్టపడి పనిచేయాలని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజా నర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎమ్మెల్యే రోహిత్ రావ్, ఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.