- ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రెసా కృతజ్ఞతలు
భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగంతో రెవెన్యూ ఉద్యోగులలో మనోధైర్యం పెంచిదని ట్రెసా సెంట్రల్ కమిటీ అభిప్రాయపడింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఉద్యోగులు సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన తీరు జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి నుండి కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగుల అందరిలో నూతన ఉత్సహాన్ని నింపిందన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రెవెన్యూ ఉద్యోగులు పడిన కష్టాలను అయన గుర్తించి వాటిని పునరావృతం కాకుండా చూస్తామని సీఎం భరోసా ఇవ్వడం మాకు సంతోషానిచ్చిందన్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ వల్ల ప్రజల్లో రెవెన్యూ ఆధికారుల పట్ల ప్రజలకు వున్న భావన అనేది అయన చాలా స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాము కూడా ప్రభుత్వం తమ పై పెట్టుకున్న నమ్మకాని వమ్ము కాకుండా నిలబెట్టుకుంటామని వారు అన్నారు. ముఖ్యంగా భూభారతి చట్టం వల్ల రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి సమస్యలను త్వరతిగతిన తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు కె.నిరంజన్ రావు, సీఎల్‌బీ.శాస్త్రి, ట్రెసా ప్రతినిధులు రమన్ రెడ్డి, కృష్ణయ్య, సుధాకర్, రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.