అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని రష్యా అద్యక్షుడు పుతిన్ తెలిపారు. కజికిస్తాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ చాలా తెలివైన వాడని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు.. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా అయినపై రెండుసార్లు దాడి జరిగిందని గుర్తుచేశారు.