హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.