Saturday, April 19, 2025
spot_img

కారు డోర్ లాక్‌ ప‌డి ఇద్ద‌రు బాలిక‌లు మృతి

Must Read
  • పెళ్లి ప‌నుల్లో త‌ల్లులు బిసి.. పిల్లలు మృతి
  • చేవెళ్ల మున్సిప‌ల్‌లో ఘ‌ట‌న‌

ఓ ఇద్ద‌రు త‌ల్లుల ప్రేమ కారులో మాడిపోయింది. వినడానికి భారంగా అనిపించిన ఇదే నిజం పెళ్లి ప‌నుల్లో బిసిగా ఉండీ పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోక పోవ‌డంతో ఈ ధారుణం జ‌రిగింద‌నీ స్థానికులు మండిప‌డుతున్నారు. కారులో ఇరుకున్న పిల్ల‌లు ఎంత స‌మ‌యం మృత్యువో పోరాడారో.. ఎలా త‌ల్ల‌డిల్లారో త‌లుచుకుంటేనే ప్రాంత‌మంతా నిశ్శ‌బ్ద‌మైంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరిగిద్ద చెందిన తెలుగు జంగయ్య కొడుకు రాంబాబు వివాహం ఈ నెల 30న నిశ్చయమైంది. దీంతో ఆయన అల్లుళ్లు, కూతుళ్లైన చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్‌, జ్యోతి దంపతులు, వారి కుమార్తె తన్మయిశ్రీ (5), షాబాద్‌ మండలం సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన మహేందర్‌, ఉమారాణి దంపతులు, వారి కుమార్తె అభినయశ్రీ (4) దామరిగిద్దకు వచ్చారు. సోమవారం కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి కార్డులు సెట్ చేస్తుండగా… మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పిల్లలిద్దరూ ఆడుకుంటూ బయటికి వెళ్లారు. ఇంటి ఎదుట ఉంచిన మేనమామకు చెందిన ఆల్టో కారులో ఎక్కి ఆడుకుంటుండగా డోర్ లాక్ అయ్యింది. కుటుంబసభ్యులు గమనించకపోవడంతో అందులోనే ఉండిపోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిల్లల కనిపించకపోవడంతో బయటికి వచ్చి చూడగా.. కారులో స్పృహ తప్పి పడి ఉన్నారు. వెంటనే లాక్‌ తీసి చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Latest News

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS