ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు జారీచేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో పని చేసే వెటర్లు, చెఫ్‌లు మాస్కులు, చేతులకు గ్లౌస్ ధరించాలని, వంట చేసే ఆహారశాలలో సీసీటీవి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల సహారన్‌పూర్‌లోని ఒక హోటల్ లో రొటీలు తయారుచేస్తున్న ఓ చెఫ్, ఆ రొటీల పై ఉమ్మివేస్తునట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. మరోవైపు ఘాజీయాబాద్ లో సైతం ఓ జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు జ్యూస్‌లో మూత్రం కలిపినట్టు మరో వీడియో వైరల్ అయింది . దీంతో సీఎం యోగి ఇలాంటి ఘటనల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోటల్స్, రెస్టారెంట్స్‌ను నిరంతరం పరిశీలించాలని అధికారులను సూచించారు.