- వండర్లాని బూచిగా చూపించి విల్లాలు అమ్మి అమాయకులను మోసం చేసే తంతు ఆపాలి..
- విడి, విడిగా గృహ నివాస అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం.. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధం,.!
- హెచ్.ఎం.డి.ఏ,.. ఎం.ఏ. అండ్ యు.డి ఉన్నత అధికారులు, విజిలెన్స్ నిఘా విభాగాలు తనిఖీ చేయాలి..
- అప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయంటున్న స్థానిక ప్రజానీకం..
- ప్రభుత్వ ఖజానాకు చెందవలసిన లక్షల రూపాయల పన్ను సొంత జేబుల్లోకి..
- తప్పుడు సర్వేలతో అఫీషియల్ గా ప్రభుత్వ భూములు మాయం
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఏ.డీ సర్వే- చేపించిప్రభుత్వ భూమిని కాపాడి బ్యూరోక్రాట్ గా తన నిబద్ధత చాటుకోవాలి..
- సర్వే నెంబర్ 432లోని 2 ఎకరాల 25 గుంటల భూదాన్ భూమి ఎక్కడ..?
- హైడ్రా రంగనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి, సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించకపోతే ఫోర్త్ సిటీ స్వాహ..
- పర్మిషన్ వున్నది ఆరున్నర ఎకరాలకు.. నిర్మాణాలు సాగుతున్నది ఎనిమిదిన్నర ఎకరాల్లో..
- రేరా అనుమతులు లేవు.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం..
- బి.ఆర్.ఎస్. నాయకుడు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, బినామీలతో నిస్సిగ్గుగా సాగిస్తున్న రియల్ వ్యాపారం..
- అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్, తుక్కుగూడ కమిషనర్ లు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలి..?
తెలంగాణకు ప్రధాన ఆదాయ మార్గం హైదరాబాద్ విశ్వనగరం. ఇంతకింతకు అభివృద్ధి చెందుతూ ప్రజల మౌలిక వసతుల నాణ్యత పెంచడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు.. ఈ ప్రభుత్వ కృషిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ట్ సిటీ ని ప్రకటించింది ఈ ఫోర్త్ సిటీ వేల ఎకరాలు రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న పరిస్థితి.. ఈ విషయంపై దృష్టి సారించిన పలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి విల్లాలు కట్టి, గేటెడ్ కమ్యూనిటీలు అత్యాధునిక ఇళ్ల నిర్మాణం రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతున్న పరిస్థితి నెలకొంది.. ఈ తరుణంలో కొందరు వక్రబుద్ధి కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులకు డబ్బు ఎరగా చూపి ప్రభుత్వం భూమి పక్కనే ఎకరా రెండు ఎకరాలు, మూడు ఎకరాలు కొని అప్పనంగా వచ్చే ఆ ప్రభుత్వ భూమిని కొట్టేసే స్కెచ్ లు వేస్తున్నారు.. ఆ స్కెచ్ లో భాగంగానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెంకటేష్ గుప్తా ప్లాను కూడా వర్కౌట్ అయింది అనే చెప్పాలి..
ఔటర్ రింగ్ రోడ్డును అనుకొని రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 8.3 ఎకరాల్లో విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలు చేపడుతున్నారు.. ఉప్పల వెంకటేష్ గుప్తా అనే నాయకుడు అతని బినామీలతో 6.1/2 ఎకరాల స్థలంలో హెచ్.ఎం.డి.ఏ నుండి లేఔట్ కు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. అంటే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విడదీసి రోడ్లును వేసి అభివృద్ధి చేసి లేఅవుట్ పైన తుక్కుగూడ మున్సిపాలిటీ నుండి విడివిడిగా గృహ నిర్మాణ అనుమతులు తీసుకొని.. గేటెడ్ కమ్యూనిటీ అని గ్రూప్ హౌస్ లు కట్టి విక్రయిస్తున్నారు. ఈ విధంగా చేయడం మున్సిపల్ నిబంధనల ప్రకారం చట్ట విరుద్ధం. ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ తీసుకుంటే కోటి, రెండు కోట్లు అదనంగా పన్ను కట్టాలి.. ఈ పన్ను ఎగవేత కోసమే ఈ విధమైన దుశ్చర్యకు, అవినీతికి పాల్పడ్డాడు, అనడానికి నిదర్శనం ఈ వెంచర్ లో ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు అనే మా వార్త కథనం నిదర్శనం..
వండర్లా పక్కన అనుకొని ఉన్న సర్వే నెంబర్స్ 430, 431, 325, 427పీ, 429పీ.. కొంగర ఖుర్ద్(ఎ) గ్రామం.. ఇక్కడ విలాసవంతమైన డ్యూప్లెక్స్ నిర్మాణాలు పదుల సంఖ్యలో నిర్మించి.. ఈ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూరా ప్రహరీ నిర్మించి.. ఆరున్నర ఎకరాల్లో హెచ్ఎండిఏ లేఔట్ (041598/ఎల్.టి/జెడ్ఏ/ఎఫ్ ఎల్.టి/యూ6/హెచ్.ఎం.డి.ఏ/02012021) అనుమతులు తీసుకొని.. ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణం చేపట్టారు సదరు వెంకటేష్ గుప్తా.. గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి అనుమతులు లేవు.. కానీ గేటెడ్ కమ్యూనిటీ ప్రహారీ నిర్మాణం చేపట్టారు.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం..
తెలంగాణ రేరా అనుమతులు తీసుకోలేదు.. ఈ విషయంపై సంబంధిత హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నిస్తే మేము లేఔట్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చాము, గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వలేదు.. అని వ్యక్తపరచిన ధ్రువపత్రాలు ఆదాబ్ టీమ్ సేకరించడం జరిగింది.. కాగా సర్వే నెంబర్ 432 భూదాన భూమి విషయంపై పరిశోధించిన అనంతరం ఇక్కడ కబ్జాకు గురైన 432లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని మహేశ్వరం తహసీల్దార్‌ను కోరితే.. సమగ్రంగా దర్యాప్తు చేసి, కబ్జాకోరులను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై లోకల్ మున్సిపాలిటీ అయిన తుక్కుగూడ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తే.. తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఒక్కొక్క విల్లాకు పర్మిషన్లు ఈ మున్సిపాలిటీ నుండి ఈ కమిషనరే స్వయంగా ఇచ్చారని తెలిసింది.. ఇది మరింత విడ్డూరం.. సబ్ రిజిస్ట్రార్ ఈ విషయాన్ని గ్రహించి.. రిజిస్ట్రేషన్లు ఆపి.. ఉన్నత అధికారులకు తెలియపరచి.. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరితే.. నాకేం అవసరం..? నేను చార్మినార్ ను అమ్మినా రిజిస్ట్రేషన్లు చేస్తానని దురుసుగా మాట్లాడటం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తున్న విషయం.. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సర్వే నెంబర్ 432లో కబ్జాకు గురైన 2ఎకరాల 25 గుంటల భూదాన్ భూమిని రక్షించి ప్రజాప్రయోజనార్థం ఉపయోగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
జిల్లా కలెక్టర్, రేరా రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.. మరిన్ని ఆధారాలతో మరిన్ని సంచలన విషయాలను మీముందుకు తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..