ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 29న జరిగే విద్యార్థి విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఓయూ జేఏసీ, టిజి జేఏసీ, టిపిసిసి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అభినందనలు తెలపడం కోసం యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ నిర్వాహకులు, ఓయూ జేఏసీ,టీజీ జేఏసీ,టిపిసిసి నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి, మండ్ల రవి, పూసల రమేష్, ఊట్కూరి లెనిన్, పల్సా ఆంజనేయులు గౌడ్,సంజీవ రెడ్డి,బిక్షపతి నాయక్, జానకిరామ్,శ్రీనివాస్, విజయ్, మల్లేష్ నాయక్, మౌనిక, దివ్య, కృష్ణవేణి, అనూష, తదితరులు పాల్గొన్నారు.