Wednesday, March 26, 2025
spot_img

పుచ్చకాయ ప్రియులు జాగ్రత్త..

Must Read
  • మోతాదుకు మించి తింటే విషంతో సమానం
  • మార్కెట్లో సైతం పుచ్చకాయ కల్తీ అవుతున్న పరిస్థితి
  • కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అవసరమే
  • లేదంటే ఆరోగ్యం చేజేతులా పాడు చేసుకున్నట్టే

ఈ ఏడాది మార్చి మొదటి ఎండలు దంచికొడుతున్నాయి. అయితే మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో 92శాతం నీరు, 6శాతం చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకనే పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయ శరీరంలో నీటీ కొరతను తీర్చి హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలాంటి కారణాలతో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ మోతాదుకు మించి పుచ్చకాయ తింటే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాచారం ప్రకారం, పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింతగా పెంచే అవకాశం ఉంది. పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందువల్ల, పుచ్చకాయను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే పుచ్చకాయని తక్కువ మోతాదులో తినడం మంచిది.

పుచ్చకాయలో కల్తీని గుర్తుపట్టడం ఎలా..?
మీరు పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు పండ్ల వ్యాపారిని ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి. ఆ తరువాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్ తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతుంది. అది న్యాచురల్ పుచ్చకాయ అయితే, దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని ఎఫ్.ఏస్.ఏస్.ఏ.ఐ (FSSAI) అధికారులు చెబుతున్నారు.

మోతాదుకు మించి తింటే ఆరోగ్య సమస్యలు…
పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో వాపు వస్తుంది. దీనివల్ల కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. మద్యం సేవించే వ్యక్తులు దీని కారణంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు డయాబెటిస్ సమస్య ఉన్నవారు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తినాలి. ఎందుకంటే ఇందులోని సహజ చక్కెర మీ బ్లడ్‌షుగర్‌ని పెంచుతుంది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.. వేసవి కాలంలో ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది తలనొప్పి, కండరాల బలహీనతకు దారితీస్తుంది.కొంతమందికి పుచ్చకాయ తినడం వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల దద్దుర్లు, చర్మం వాపు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల శరీరం నీటితో నిండిపోతుంది. అధిక హైడ్రేషన్‌తో బాధపడాల్సి వస్తుంది. కావున జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోక తప్పదు.

Latest News

ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం

లక్నోపై ఒక వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం మార్ష్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS