Wednesday, April 16, 2025
spot_img

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

Must Read
  • అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం
  • సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం, యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, 56 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, 8 వేల కోట్లతో యువతకు అవకాశాలు, సన్న ధాన్యంపై రూ.500 బోనస్‌, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకొస్తున్నాయని అన్నారు. సంక్షేమం ఒక ఎత్తైతే, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాలు మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు. ‘ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన వంటి అంశాలను మేము పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత దశాబ్దాలుగా ఎందరో గొప్ప నాయకులు సాధించలేనివి. మన ప్రభుత్వం ధైర్యంగా, అందరితో చర్చించి, పారదర్శకంగా ఈ లక్ష్‌యాలను నెరవేర్చిందని విక్రమార్క గర్వంగా చెప్పారు. ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల‌కు ఆదర్శంగా నిలుస్తాయని, ఇప్పటికే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్‌ మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఎన్నికల ముందు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించాం. ఇది సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్‌ చేసిన గొప్ప అడుగని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో భూసంస్కరణల వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందుకే దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిందని విక్రమార్క గుర్తు చేశారు. అయితే, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు గతంలో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు రుచించడం లేదని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయాలు వారి అస్తిత్వానికే సవాల్‌ విసురుతాయి. అందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కుట్రలు చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కంచ గచ్చిబౌలి వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అసత్య ప్రచారం చేస్తున్నాయి. వారు ఏనుగులు, పులులు తిరుగుతున్నాయని చెప్పినా, ప్రజలు సత్యాన్ని గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. చివరగా, బహుజన వర్గాలను చైతన్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ కుల సర్వే విూ కోసం, విూ హక్కుల కోసం కాంగ్రెస్‌ చేసింది. మాతో కలిసి నడవండి, బహుజన శక్తిని చాటి చెప్పండని ఆయన కోరారు.

Latest News

నోవాటెల్‌ హోటల్‌ లిఫ్ట్‌లో టెక్నికల్‌ సమస్య

ఓవర్‌లోడ్‌తో కిందకు దిగిపోయిన లిఫ్ట్‌ లిఫ్ట్‌లో సిఎం తదితరులతో ఓవర్‌లోడ్‌ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నోవాటెల్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS