Wednesday, September 10, 2025
spot_img

మన బట్టతలకు మనమే కారణం

Must Read

మన జుట్టు రాలడానికి మనమే కారణం. మనం చేసే తప్పులే మనకు బట్టతలను తెచ్చిపెడతాయి. మన రోజువారీ అలవాట్లను మార్చుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. జట్టు రాలడానికి జెనెటిక్స్, హార్మోన్ల హెచ్చుతగ్గులు ప్రధాన కారణమైనప్పటికీ చాలా మంది స్వీయ తప్పిదాలతో జుట్టు ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారు. జుట్టును తరచుగా కడగడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే దానికి ఉండే సహజమైన నూనెలు తొలిగిపోతాయి. ఫలితంగా తల చర్మం, జుట్టు పొడిగా, పెళుసుగా తయారవుతుంది. తద్వారా జుట్టు కుదుళ్లకు చేటు చేస్తుంది.

తల చర్మం జిడ్డుగా ఉన్నవాళ్లు వారానికొకసారి జుట్టును కడుక్కుంటే మంచిది. టైట్ హెయిర్ స్టైల్స్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. పోనీటెయిల్స్, బన్స్, జడలు చూడటానికి బాగానే ఉంటాయి. కానీ.. జుట్టు రాలడానికి దారితీస్తాయి. మానసికంగా నిరంతరం ఒత్తిడికి గురైతే జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ప్రెజర్ అనేది కంటిన్యూ అయితే జట్టును శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. అధిక టెంపరేచర్ల వద్ద స్ట్రెయిట్నర్లు, కర్లింగ్ ఐరన్లు, బ్లో డ్రైయర్లను వాడితే జుట్టు మూలాలు వీక్ అయి విరిగిపోతాయి.

కాబట్టి ఇలాంటివాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ఎక్కువ మంది జుట్టు మీద ఫోకస్ పెడతారు గానీ తల చర్మం గురించి పట్టించుకోరు. తల చర్మం బాగుంటేనే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది. తల చర్మం క్లోజ్ అయి, పొడిబారితే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు సరఫరా కావు. ఈ నేపథ్యంలో జుట్టు రాలుతుంది. తడి జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దువ్వడం, ముడులు తీయడం సరికాదు. దీనివల్ల జుట్టు సాగుతుంది. విరిగిపోతుంది. దీంతో బట్టతల వస్తుంది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This