- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తెలంగాణలో అనేక రెసిడెన్సియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని పేర్కొన్నారు. దసరా కంటే ముందే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల నిర్మాణానికి భూమి పూజ చేస్తామని, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రెసిడెన్సియల్ పాఠశాలలో వసతులు సరిగ్గా లేవని, రాష్ట్రవ్యాప్తంగా 1023 పాఠశాలలు ఉంటే , 600 పైగా పాఠశాలలకు సొంతభవనాలు లేవని తెలిపారు. గురుకులాలు, రెసిడెన్సియల్ పాఠశాలలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.