- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తుందని అన్నారు . జనసేన కార్యకర్తలు అధికారుల విధుల నిర్వహణలో జోక్యం చేసుకోవొద్దని, వారిని విమర్శించొద్దని కోరినట్లు తెలిపారు. తమది మెతక ప్రభుత్వం కాదన్న పవన్ కళ్యాణ్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో ఉన్నతాధికారుల విధుల నిర్వహణలో జోక్యం చేసుకొని వారితో ఇష్టారాజ్యాంగా పనులు చేయించారని మండిపడ్డారు.
అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నామని తెలిపారు. అటవీశాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ వర్గాల నుండి రూ.05 కోట్ల విరాళన్ని సేకరించి అటవీశాఖకు ఇస్తానని అన్నారు.