- నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్
నాగర్‌కర్నూల్ జిల్లాలో హోంగార్డులు వారి యొక్క విధులను మంచిగా నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ రఘునంధన్ తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ పై ఎలాంటి ఫిర్యాదులు లేవని పేర్కొన్నారు. ఇలానే మంచిగా విధులు నిర్వర్తించి..జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. హోంగార్డ్‌లకు ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తేవాలని, సమస్యలను పరిష్కరించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. గ్రీవెన్స్ స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్, నాగర్ కర్నూల్ సిఐ కనకయ్య, ఆర్ఎస్ఐలు ప్రశాంత్ కళ్యాణ్ , శివాజీ , హోంగార్డ్ అధ్యక్షుడు జేమ్ములు మరియు వైస్ ప్రెసిడెంట్ రాజమల్లుతో పాటు దాదాపుగా 150 మంది హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.