Wednesday, September 10, 2025
spot_img

కవిత ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో?

Must Read

పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్

ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్‌ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని కవిత వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె లెటర్ లీక్ అయి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంకా ఆమెను పిలిచి మాట్లాడలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగం చేసినందుకు కేటీఆర్‌ పరోక్షంగా కవితకు వార్నింగ్ ఇవ్వటం, తదనంతరం ఆమె సీరియస్ కావటం తెలిసిందే. దీంతో కేసీఆర్.. కవితపై కోపంగా ఉన్నారు.

కవిత ప్రోగ్సామ్స్‌కి బీఆర్ఎస్ శ్రేణులు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే తన కార్యక్రమాలను చేపడుతున్నారు. కేసీఆరే తన నేత అని కవిత అంటున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమెతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కవిత లెటర్ అనంతరం‌ బీఆర్ఎస్ క్యాడర్ డైలమాలో పడింది. గత నెల 26న లండన్‌కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు నుంచి అమెరికా వెళ్లారు.

మరో 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ నెల‌ 10న‌ హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉంది. కేసీఆర్ ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లనున్నారు. దీంతో కేటీఆర్ ఈ నెల 10న హైదరాబాద్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడే కవిత వ్యవహారం తెర మీదికి వచ్చింది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక కేటీఆర్.. కవిత కామెంట్స్‌పై స్పందిస్తారా లేదా అనే చర్చ బీఆర్ఎస్‌ పార్టీలో కొనసాగుతోంది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This