మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై గతకొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకు సోమవారం (నేడు) తెరపడే అవకాశం ఉంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. భాజపా నేత రావ్‌సాహెబ్ ధన్వే మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరో ప్రజలకు తెలుసు, అధిస్థానం త్వరలో ముఖ్యమంత్రిని అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. దేవేంద్ర ఫడ్నవిస్ 2014 నుండి 2019 వరకు మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.