కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా పర్వాలేదు.. ఉన్నదాంట్లో ప్రజలకు విద్యా, వైద్యం రెండు అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు తీర్చిదిద్దాలి.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. అన్ని రాజకీయ నాయకుల ఆస్తులు ఏమో దండిగా పెరిగినాయి.. సొంతిల్లు లేని వాళ్లకు బంగాళాలు, ఫామ్ హౌస్ లు కోట్లల్లో ఆస్తులు.. రాష్ట్రానికి చేసిన ఈ అప్పులు కట్టేది ఎవరు.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం బాంగ్లాదేశ్ లాగో, పాకిస్తాన్ లాగో కాకుండా తెలంగాణని ఆదుకునేది ఎవరు.. లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిన రాజకీయ నాయకుల, లేదా అప్పనంగా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజల చెప్పండి..
- కుమ్మరి రాజు