“దుక్కి” ఎండిపోతున్నది..
“మొలక”.. మొఖం మాడిపోతున్నది.!
నీరు లేక “నారు మడి.. నోరు తెరుచుకుంటున్నది..!!
“కాలం” కన్నెర్రజేసి..చినుకు రాల్చనంటున్నది..!
ముందు మురిపించిన “వానా” ఇప్పుడు..
ముఖం చాటేస్తున్నది..!! “పొడి గాలే” వడివడిగా..
వీచుకుంటు వెళ్తున్నది! “దూదిపింజలా”మబ్బు తెప్పు..
నింగిన కదిలిపోతున్నది..!! ఏపుగ ఎదగాల్సిన “పైరు”..
“ఎండి” మెండిగ కన్పిస్తున్నది…! “అన్నదాత” ముఖాన..
ఇప్పుడు ఆందోళన నెలకొన్నది..!! కాలం “కరుణ” కొరకు..
“కర్షక – లోకం” ఎదురు చూస్తున్నది..! కరువు తీర వానొస్తే..
” రైతుకు” నిరాశ తీరనున్నది..!
- బొల్లెద్దు వెంకటరత్నం