Thursday, December 12, 2024
spot_img

ఫ్రీ లాంచ్‎తో..ఫ్రీగా మోసం

Must Read

మెసరా ఇన్‎ఫ్రా డెవలపర్స్‎తో జర జాగ్రత

  • కొత్త దందాకు తెరలేపిన మారెళ్ల పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ల మేఘన
  • ప్రీ లాంచ్ పేరుతో దర్జాగా కొనసాగుతున్న దందా
  • బై బ్యాక్ గ్యారంటీతో కోట్లు కొల్లగొడుతున్న వైనం
  • నిబంధనలకు విరుద్దంగా విల్లాలు, అపార్ట్మెంట్లు
  • రెండు నెలల సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా సాధ్యం..?

రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ‘ప్రీలాంచ్’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వల వేసి.. సొంతింటి కలగనేవారిని నిలువునా మోసం చేస్తున్నాయి. బంపర్ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తున్నారు. ఆలోచిస్తే ఆశాభంగం..మంచితరుణం మించిన దొరకదంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ, మాయ మాటలతో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ప్రీ లాంచ్ పేరుతో మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తున్న దందాపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం.

మారెళ్ల పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ల మేఘన మెసరా ఇన్‎ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాదాపూర్‎లో రియల్ ఎస్టేట్ సంస్థను నెలకొల్పి, ఎలాంటి అనుమతులు లేకుండానే దర్జాగా తమ దందాను కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొల్లూర్ 30 ఎకరాల్లో విల్లాలు, హై రైస్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెబుతూ, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ముఖ్యంగా రేరా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా, ఏజెంట్లను నియమించుకొని వారికి పెద్దమొత్తంలో కమిషన్స్ ఇస్తామని ఆశ చూపించి ఫ్రీ లాంచ్ సేల్స్ చేస్తున్నారు. పైగా బై బ్యాక్ గ్యారంటీ అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరు కొల్లూర్‎లో చేపడుతున్న ప్రాజెక్ట్ స్థాపించి కేవలం రెండు నెలలు మాత్రమే అవుతుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం ఎలా సాధ్యం అవుతుంది అనే సందేహాలు కలుగుతున్నాయి. అసలు వీరికి కొల్లూర్ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఎంత..? రెండు నెలల క్రితం ప్రారంభమైన సంస్థ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం సాధ్యమేనా..? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. మాయమాటలతో ఈ సంస్థ చేస్తున్న దందాపై త్వరలో పూర్తి కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్..మా అక్షరం అవినీతిపై అస్త్రం.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS