మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో అక్కడ అభివృద్ధి, సంక్షేమం ఉంటుందని వంజరి కుల మహిళ నాయకురాళ్ళు తెలిపారు. ఈ మేరకు తార్నాకలోని వంజరి సంఘం రాష్ట్ర కార్యాలయంలో వంజరి కుల మహిళా సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందు వాహిని సభ్యురాలు భారతీయం సత్యవాణి, పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా పెంచాలని సూచించారు. మహిళలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిచేందుకు కృషి చేయాలన్నారు. వంజరి సంఘం వారు సమజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వివిద రంగాల్లో రాణిస్తున్న మహిళలను సంఘం వారు ఘనంగా సత్కరించారు. అనంతరం చిన్నారులు వివిద సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాలేరు నరేందర్, ప్రధాన కార్యదర్శి కందారి వెంకటేషం, కోషాధికారి కాలేరు అమరేందర్, ముఖ్యసలహాదారులు సాల్వేరు ముత్తయ్య, కరిపే ప్రవీణ్, కార్యవర్గ సభ్యుడు రాజు, మహిళా అధ్యక్షురాలు గాయరి శోభ, కార్యవర్గ సభ్యురాలు ఆరెగీత, సాల్వేరు దేవిక, దాత్రిక సాయిరజని, బెండె అనురాధ, బొగ్గుల సునితతో పాటు వలువురు పాల్గొన్నారు.