Sunday, September 29, 2024
spot_img

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

Must Read

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి, సీఓఓ ధీరన్ చౌదరి, వండర్ లా పార్క్ హెడ్ మధు సూధన్ గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి మాట్లాడుతూ ,
వండర్‌లా లో విప్లవాత్మకమైన అనుభవాలను సృష్టించడం కోసం అంకితభావంతో ఉన్నామని తెలిపారు. హైపర్‌వర్స్ సాంకేతికత యొక్క భవిష్యత్తుకు ఒక సాహసోపేతమైన ముందడుగును సూచిస్తుందని తెలిపారు.అద్భుతమైన రీతిలో ఊహాశక్తితో ఆవిష్కరణను మిళితం చేస్తుందని అన్నారు. జి -ఫాల్ అసాధారణమైన థ్రిల్స్ విభాగంలోకి సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సహసించే వారికి మరపురాని అనుభవాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్‌లా హైదరాబాద్‌లో ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. వ్యక్తిగత జీవితంలో కొత్త అనుభవాలను అన్వేషించడంలో వర్ధిల్లుతున్న వ్యక్తిగా, ప్రధాన గ్లోబల్ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్‌లను వండర్‌లా ఎలా తీసుకువస్తోందో చూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని తెలిపారు. విఆర్ -ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా అగ్రగామిగా ఉందని వెల్లడించారు. ఈ రైడ్‌లు కేవలం థ్రిల్స్ గురించి మాత్రమే కాదని,వినోదం,సాహసాలను ఎలా అనుభవిస్తామో వాటిని సమూలంగా మారుస్తున్నాయని అన్నారు. వండర్‌లా సందర్శకులను ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com ద్వారా ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవాలని వండర్ లా తెలిపింది. కస్టమర్లు తమ సందర్శన రోజున నేరుగా పార్క్ కౌంటర్‌ల నుండి టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 నెంబర్లకు సంప్రదించవచ్చు.

Latest News

కబ్జా చెర వీడిన ప్రభుత్వ భూమి

మొయినాబాద్‌, క‌న‌క‌మాడి గ్రామశివారులో రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసి ఐదెకరాల స‌ర్కార్ భూమి స్వాధీనం సర్వే నెంబర్ 510/పి 5 ఎకరాల భూమిని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS