- జగన్ పిలుపుతో కొవ్వొత్తుల ప్రదర్శన
- దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీసిఎం జగన్
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శాంతి ర్యాలీ చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ లో పాల్గొన్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు.






పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అన్నీ జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్యాండీల్ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. వైఎస్ జగన్ పిలుపుతో సాయంత్రం పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.