మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతుల సమస్యలు,కరెంట్ చార్జిలు, ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. డిసెంబర్ 27న విద్యుత్ చార్జీలపై ఆందోళనలు, జనవరి 03న ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ పోరుబాట నిర్వహించనుంది.విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు.
జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజినల్ కొ-ఆర్డినేటర్లు హాజరయ్యారు.