ఎందుకో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ… ఏమీ పట్టనట్టు ఉంటారు.. మంచి నియమాలకు నిలువునా.. నీళ్లు వదిలి ఎంచక్కా తిరుగుతారు.. కాసింత ఇంగితం లేక.. కళ్ళు మూసి ఉంటారు.. పద్ధతిగా బ్రతకాలి అనే కనీస ఆలోచన మరుస్తారు.. ఎవరు గమనించట్లేదంటూ.. వెకిలి వేషాలేస్తుంటారు.. సమాజ హితాన్ని ఎంచక్కా.. గాలికి వదిలి వేస్తారు.. పద్ధతులు ఎన్నున్నా.. వాటిని అతిక్రమించి నడుస్తారు… ఏమవుతుందిలే అనుకుంటూ.. పొరపాటులెన్నో చేస్తారు.. ఇబ్బంది తలమీదికొస్తే… ఇక తల్లడిల్లి పోతారు.. ఎవరో మన వెంట ఉండి కాపలాను కాయరు… బలపం మన చేతికిచ్చి.. పలక దిద్ద పెట్టరు.. తప్పు, ఒప్పు తేడాలేంటో… తెలుసుకొని తిరిగాలి.. సమాజహితులల్లో.. మనం ఒకరమై బ్రతకాలి..
- బొల్లెద్దు వెంకట రత్నం