కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మొయినాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఏనుగుల ప్రిన్సీ(19).. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వనజ, పునేష్, ఎప్పటి లాగే.. పనికోసం బయటికి వెళ్లడం జరిగింది. పని ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే సరికి ప్రిన్సీ కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇండ్ల వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బుదవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా స్థానికంగా అందిన సమాచారం మేరకు యువతికి పెండ్లి నిశ్చయం అయినట్లు తెలిసింది.