కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ తెలిపారు. “శ్రీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! సత్యం, న్యాయం మరియు సామాన్య ప్రజల అభ్యున్నతి పట్ల మీ అచంచలమైన నిబద్ధత భారతదేశం అంతటా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మీ అన్ని ప్రయత్నాలలో మీకు బలం మరియు విజయం లభించాలని కోరుకుంటున్నాను.” అని షర్మిల ఎక్స్‌లో ట్వీట్ చేశారు.