ఓయూ పరీక్షల విభాగం సూపరిటెండెంట్ బి.రమేష్
ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ నైపుణ్యాల కోసం కరాటేను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూపరిటెండెంట్ బి. రమేష్ అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో సమురాయ్ ప్రొఫెషనల్ కరాటే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 29 మంది విద్యార్థులు కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వివిధ కలర్ బెల్ట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కటా, కుమిత్, పంచ్లు, కిక్స్, అటాక్స్, త్రోలు, సాన్బన్ కుమిత్, ఆయుధాల ప్రదర్శన వంటి విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ హోల్డర్, ఇండియా స్టైల్ చీఫ్ షిహాన్ సిద్దార్థ్ షా, ప్రార్ధన మణికొండ, కిక్కర్స్ యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కళ్యాణ్ మాస్టర్, నరసింహ మాస్టర్, నాగరాజ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.