Saturday, August 2, 2025
spot_img

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Must Read
  • 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ
  • నామినేషన్లు దాఖలుకు ఆగస్టు 21 చివరితేదీ
  • సెప్టెంబర్‌ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన

జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం శుక్రవారం షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 9న ఆ ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జగదీప్‌ ధన్‌ఖడ్‌ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఈ పక్రియ అనివార్యమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ధన్‌ఖడ్‌ తన పదవిని వీడారు. ఈ నేపథ్యంలో ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. దీనిపై ఆగస్టు 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నామినేషన్లు దాఖలుకు చివరితేదీ ఆగస్టు 21గా ప్రకటించింది. పోలింగ్‌ తేదీ నాడే అంటే సెప్టెంబర్‌ 9నే ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటమి.. ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు తెర పైకి వచ్చాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌, జేడీయూ నేత హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సహా పలువురు నేతల పేర్లు ఉప రాష్ట్రపతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు భాజపా ఆ పదవిని అప్పగిస్తుందని సమాచారం. ఇదిలావుంటే ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ పంపారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే వైదొలిగారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్‌ తర్వాత ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మరోవైపు విపక్ష కూటమికి లోక్‌సభలో 234 మంది సభ్యులు, రాజ్యసభలో 79 మంది సభ్యుల బలముంది. మొత్తంగా ఎన్డీయేకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Latest News

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వినతి ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని మరింత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS