మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర...
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ డాబా వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ని ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడిపోవడంతో అతని తలపై నుండి...
నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్
నాగర్‌కర్నూల్ జిల్లాలో హోంగార్డులు వారి యొక్క విధులను మంచిగా నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ రఘునంధన్ తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో...
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై న్యాయవాది రవికుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పుష్ప- 02 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా మరణించిన విషయం తెలిసిందే.
పోలీస్ యాక్ట్ కింద ముందస్తు అనుమతి లేకుండా సంధ్య థియేటర్ ప్రీమియర్...
బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్‌స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...
బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎం.ఎన్. నాగరాజ్ క్రైమ్ బ్యూరో, బెంగళూరు ఈఐఆర్పి బృందం సహాయంతో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ భగవంత్రాయ్ మశ్యాల్...
గాజువాకలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మీత మంగళవారం అక్కిరెడ్డిపాలెంలో అపార్ట్మెంట్ మూడవ అంతస్తుపై నుండి దూకి జంట ఆత్మహత్య చేసుకుంది .ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా లేదా.. ఇంకా ఏమైనా కారణాల ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ శబరీష్ మృతదేహాన్ని పరిశీలించారు.
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...