- లక్షల రూపాయల ప్రజాధనం వృధా…
- జిహెచ్‌ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..?
- మల్కాజిగిరి డివిజన్ భవాని నగర్ బస్ స్టాప్ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు..
ప్రజాధనంతో జిహెచ్‌ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మూలన పడ్డాయి. చెత్త బుట్టలను కూడా గతంలో మల్కాజిగిరి సర్కుల్లో అన్ని డివిజన్ లో ఎర్పాటు చేసినవి దొంగలించబడ్డాయి. చాలా నెలలుగా చెత్త బుట్టలు లేకుండా కేవలం స్టాండ్ లే దర్శనం ఇచ్చాయి. గత మూడు నాలుగు నెలల ముందు జిహెచ్‌ఎంసి అధికారులు చెత్తబుట్టలు లేని ప్రతీ చోట చెత్త బుట్టలను అమర్చి చేతులు దులుపుకున్నారు. చిత్రంలో కనిపిస్తున్న చెత్తబుట్టలు మల్కాజిగిరి డివిజన్ భవాని నగర్ బస్ స్టాప్ లో నేలపైన కాకుండా చెత్త బుట్టలు గోడకు ఓరిగాయి. ఇది ఎక్కడో అని పొరబడితే పప్పులో కాలేసినట్టే. ఈ బస్టాప్ పక్క వీధిలోనే జిహెచ్‌ఎంసి మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయము. నిత్యం డిసితోపాటు సిబ్బంది మొత్తం ఇదే దారి నుండి వెళ్తూ వస్తూ ఉంటారు. అయినా గోడకు ఒరిగిన చెత్తబుట్టలను మాత్రం దాని స్థానంలో యధావిధిగా ఏర్పా టు చేయాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరం. లక్షల రూపాయలు ప్రజాధనం ఖర్చుపెట్టి, సరి అయిన నిర్వహణ లేకపోతే వాటిని ఏర్పాటు చేయడం ఎందుకని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తు న్నా రు. మరి ఇప్పటికైనా గోడకు ఒరిగిన చెత్తబుట్టలతో పాటు మల్కాజిగిరి సర్కుల్ వ్యాప్తంగా ఏర్పా టు చేసిన చెత్తబుట్టలపై ఒక నజర్ వేయవలసిన అవసరం అధికారుల పైన ఎంతైనా ఉంది.