నగరంలోని టి-హబ్ వేదికగా ‘డిజిప్రెన్యూర్.ఏఐ’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త ఉపాధి అవకాశాలు
కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నికీలు గుండ తెలిపారు.
కృత్రిమ మేధ (ఏఐ) సాధనాల వినియోగంపై 21 రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఈ శిక్షణను అందించారు.
వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు అనే భేదం లేకుండా ఎవరైనా ఈ కోర్సులో పాల్గొని ఏఐ ద్వారా ఆదాయ మార్గాలు, వృత్తిపరమైన అభివృద్ధి సాధించడంపై శిక్షణ పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంపా నాగేశ్వర్ రావు, ప్రముఖ మోటివేషనల్ శ్రీ వేణుకళ్యాణ్, ఆన్ఈజీ వ్యవస్థాపకులు శ్రీ అభిషేక్ బొడ్డు, 8ఎఫ్ఎక్స్ వ్యవస్థాపకులు శ్రీ కరణ్ షా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ నైపుణ్యాలను అలవర్చుకోవడం అత్యంత అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నిర్వాహకులు, అతిథుల చేతుల మీదుగా పట్టాలను ప్రదానం చేశారు. ఆధునిక సాంకేతికతను తెలుగులో అందుబాటులోకి తీసుకురావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తరువాతి తెలుగు ఏఐ బూట్ క్యాంప్ 2. ఆగష్ట్ 11 తేదీ నుండి మొదలవ్వనుంది. మరిన్ని వివరాల కోసం 7331112686, 7331112687, 7331112688 నంబర్ లను సంప్రదించండి.