Friday, June 6, 2025
spot_img

‘మిరాయ్’ టీజర్‌ వచ్చేస్తోంది

Must Read

సూపర్ హీరో తేజ సజ్జా సూపర్ యోధగా తన అడ్వెంచ‌రస్ యాక్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కుర్ర క‌థానాయ‌కుడి మూవీ ‘మిరాయ్’ టీజర్ ఈ నెల‌ 28న విడుదల కానుంది. ఈ గ్లింప్స్ ఖచ్చితంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ప్రేక్షకులను సినిమా కోసం క్రియేట్ చేసిన స‌రికొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ ఎక్‌స్ట్రార్డినరీ టీజర్ చూడాలంటే మరో రెండు రోజులు వేచి ఉండక త‌ప్ప‌దు.

టీజర్ పోస్టర్‌లో తేజ సజ్జా చేతిలో మంత్రదండం పట్టుకొని.. నడుస్తున్న రైలు పైన నిలబడి, రిస్కీ స్టంట్ చేస్తూ క్యారెక్టర్ బోల్డ్ నేచర్‌ని ప్రజెంట్ చేస్తోంది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ యాక్షన్-అడ్వెంచర్ కొత్త షూటింగ్ షెడ్యూల్ ముంబైలోని చారిత్రాత్మక గుహల్లో జరుగుతోంది. తేజ సజ్జాతోపాటు మ‌రికొంతమంది ప్రధాన తారాగణం ఈ తాజా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో సూపర్ యోధ పాత్ర పోషించడం కోసం తేజ సజ్జా అద్భుతంగా మేకోవర్ అయ్యారు. ఇందులో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్‌గా నటించగా రితికా నాయక్ కథానాయికగా నటించింది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతోపాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి సంగీతం అందించగా శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

ఈ చిత్రం 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News

బడి పిల్లల భవిష్యత్‌ను బలిపెట్టకండి

జూన్ నెల వచ్చేసింది. జోలె పట్టుకొని కొత్త బిచ్చగాళ్లు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మా కాలేజీలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS