Tuesday, June 3, 2025
spot_img

మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఇలా తెలుసుకోండి

Must Read

మీ కళ్లు సాఫ్ట్‌గా, మచ్చలు లేకుండా క్లియర్‌గా మెరుస్తూ ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు తక్కువేనని చెప్పొచ్చు. బాడీలో రక్త ప్రసరణ బాగా జరిగితే అన్ని భాగాలకూ సరిపడా ప్రాణవాయువు, పోషకాలు అందుతాయి. దీంతో నేత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కళ్లు హెల్దీగా ఉంటే మీరూ ఆరోగ్యంగా ఉన్నట్లే. రోజూ ఒకే టయానికి పడుకోవడం, అలారం లేకుండా అలవాటు ప్రకారం మేల్కొనడం మంచి ఆరోగ్యానికి సంకేతాలు. దీనిబట్టి మీ స్లీపింగ్ సైకిల్ కరెక్టుగా ఉందని అర్థం. ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం.


మీ చర్మం కూడా కళ్ల మాదిరిగానే సున్నితంగా, ఏ మచ్చలూ లేకుండా మెరిసిపోతే అదీ మంచి ఆరోగ్యానికి సిగ్నలే. ఒంట్లో ఎక్కడైనా వాపు లేదా ఇన్ఫెక్షన్ ఉంటే చర్మంపై పసుపు పగుళ్లు, నల్ల మచ్చలు లేదా ఇతర గుర్తులు కనిపిస్తాయి. అందువల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటే మీరూ బాగున్నారనే తెలుసుకోండి. నిత్యం పొద్దున్నే మోషన్ సాఫీగా జరిగితే మీ జీర్ణవ్యవస్థ మంచిగా పని చేస్తోందని చెప్పొచ్చు. జీర్ణ సమస్యలు లేకపోతే మీ బాడీ మీరు తినే ఫుడ్‌ని బాగా అరిగించుకుంటోందనటంలో ఎలాంటి సందేహంలేదు. పేగుల్లో సమస్యలు ఉంటే మల విసర్జన కష్టంగా మారుతుంది. కాబట్టి ఈ కాలకృత్యం సక్రమంగా ఉండటం ప్రధానం.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలరు. వాళ్లలో మూడ్ స్వింగ్స్ తక్కువగా ఉంటాయి. ఒత్తిడి, కోపం, చిరాకు, నిస్సహాయత వంటి నెగెటివ్ ఎమోషన్స్ అదుపులో ఉంటే మీరూ మానసికంగా గుడ్ అనే అనొచ్చు. మెంటల్‌గా ఫ్రీగా, పీస్‌ఫుల్‌గా ఉంటే అది శారీరక ఆరోగ్యంపైనా మంచి ప్రభావమే చూపుతుంది. శారీరకంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మీరు త్వరగా రికవర్ అయితే మీరు బలంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్నిబట్టి మీకు ఇమ్యునిటీ పవర్ ఉందని అర్థం. మీ గుండె ఆరోగ్యాన్ని కూడా క్రమంతప్పకుండా గమనించాలి. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి. రోజూ ఎక్సర్‌సైజ్ చేయాలి.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS