Friday, July 18, 2025
spot_img

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తాం

Must Read
  • కార్మికులపై వేధింపులు మానుకోవాలి
  • రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ఏజెన్సీల వేధింపులు
  • 904/2015 మెమోను రద్దు చేయాలి : నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్

కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులను వేధిస్తున్న గ్యాస్ డీలర్లపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తామని తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడంలేదని, ఇకముందు కార్మిక శాఖ అధికారుల భరతం కూడా పడతామని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గము, సలహాదారులు కలిసే ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు నకిరేకల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేల మంది గ్యాస్ డెలివరీ వర్కర్స్ వివిధ గ్యాస్ డీలర్ల వద్ద పనిచేస్తున్నారని ఏ ఒక్క గ్యాస్ ట్రేడర్ కూడా కార్మిక శాఖ నిబంధనలు పాటించకుండా వేధిస్తున్నారని చెప్పారు. జీతాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లించకుండా అన్యాయంగా అక్రమంగా అకారణంగా కార్మికులను తొలగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గౌరవ సలహాదారులు చామకూర రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక శాఖ అధికారులు పూర్తిగా నిద్రపోతున్నారని అతి త్వరలో కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత మూడు నెలల క్రితం కమిషనర్ ను లిఖితపూర్వకంగా అపాయింట్మెంట్ కోరిన ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సలహాదారులు కె వి గౌడ్ మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీలు అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నప్పటికీ కార్మికులు ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్నారని ఆయన తెలిపారు. గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలు తమకు ఉన్న రాజకీయ, ఆర్థిక బలాన్ని అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యూనియన్ ప్రధాన కార్యదర్శి బుర్ర చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ పిఎఫ్ ఈఎస్ఐలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 904 మెమోను తక్షణమే రద్దు చేయాలని కోరారు. కార్మిక శాఖ అధికారులకు ఈరోజు సమ్మె నోటీసులు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు, అజయ్ రెడ్డి, శ్రీకాంత్, బి.రాజశేఖర్, ఎన్.అశోక్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News

డెక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులకు తీవ్ర పరాభవం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతరలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అటు సనాతన ధర్మ పరిరక్షణ మొదలుకొని ఎటువంటి సామాజిక సేవకైనా ముందుండే వివాదరహిత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS