జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు జోన్లలో కలిపి 97 అర్జీలు స్వీకరించబడ్డాయి.
జోన్‌ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
కూకట్‌పల్లి జోన్ – 44 వినతులు
సికింద్రాబాద్ జోన్ – 18 వినతులు
శేరిలింగంపల్లి జోన్ – 18 వినతులు
ఎల్‌బీనగర్ జోన్ – 8 వినతులు
చార్మినార్ జోన్ – 7 వినతులు
ఖైరతాబాద్ జోన్ – 2 వినతులు
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థనలను స్వీకరించిన జీహెచ్ఎంసీ అధికారులు వాటిని సత్వర పరిష్కారం కోసం సంబంధిత విభాగాధికారులకు అందజేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సీఈ సహదేవ్ రత్నాకర్, అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్ సత్యనారాయణ, పంకజ, మంగతాయారు, సుభద్ర, అదనపు సీసీపీలు గంగాధర్, వెంకన్న, ప్రదీప్, రంజిత్, డిప్యూటీ సీఈవోలు సంపద, పనసరెడ్డి, పివి రావు, ఈఈలు పివి రవీందర్, రాజేశ్వర్ రావు, మమత, సీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ పద్మజ, జాయింట్ కమిషనర్లు మోహన్ రెడ్డి, శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.