తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, పలు ప్రముఖులు హాజరై దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం రామచందర్ రావు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.














