ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో అనంతిక సనీల్‌కుమార్ నటించిన ‘8 వసంతాలు’ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన ఈ కాన్సెప్ట్ సెంట్రిక్ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. హృదయాన్ని కదిలించే ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది సినీ అభిమానులకు గొప్ప అనుభూతిని పంచబోతోందని ప్రోమోలను చూస్తేనే తెలుస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనంతిక బ్యూటిఫుల్‌గా ఉన్నారు. అద్భుతమైన చీరలో ప్లజెంట్‌గా కనిపించారు. తలలో గులాబీ పెట్టిన ఆమె లుక్.. క్యారెక్టర్ నేచర్‌ని కళ్లకు కడుతోంది.

వరుసగా మ్యూజికల్ హిట్స్ అందిస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ పిక్చర్‌కి మ్యూజిక్ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. డీఓపీగా విశ్వనాథ్ రెడ్డి వ్యవహరించారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైన్‌ను, శశాంక్ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. చిత్ర నిర్మాతలు రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ప్రమోషన్స్‌ని దూకుడుగా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఫిల్మ్‌లోని ఇతర నటీనటులు.. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్. సీఈఓ బాధ్యతలను చెర్రీ చూస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్.. అరవింద్ మ్యూల్, యాక్షన్ కొరియోగ్రఫీ.. వింగ్ చున్ అంజి. పీఆర్వో.. వంశీ, శేఖర్. మార్కెటింగ్.. ఫస్ట్ షో