- గత కొద్ది రోజులుగా తెరిచి ఉన్న ఫీజ్ బాక్స్ మూత
- పలుమార్లు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు
- నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికుల ఆవేదన
జల్‌పల్లి పురపాలక సంఘం 10వ వార్డు వాదియే సాలేహీన్ లోని ప్రధాన రహదారిలో ఉన్న రహమనియా మస్జీద్ ప్రక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కొరకు గత పది రోజుల క్రితం విద్యుత్ సిబ్బంది తెరిచినా ఫీజ్ బాక్స్ మూత నేటికీ అలాగే వదిలి వేయడంతో ప్రమాదకరంగా మారిందని దింతో ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా విద్యుత్ అధికారులు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ బస్తీ యొక్క ముఖ్య మసీదు ముఖద్వారం ప్రక్కన ఉండడం అందులో రంజాన్ మాసం కావడంతో ప్రతిరోజు జరిగే నమాజ్ మరియు సాయంత్రం ఉపవాస దీక్ష విరమించడానికి పెద్దలతో పాటు పిల్లలు వస్తుంటారు ఇలాంటి ప్రదేశంలో ఫీజ్ బాక్స్ లు తెరచి ఉండడం విద్యుత్ తీగలు లూజుగా ఉండి క్రిందికి వేలాడడంతో ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడాల్సిన పరిస్థితి. ఈ సమస్యపై స్థానిక ప్రజలు పలుమార్లు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి తెలిపిన వారు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని పరిష్కరపరమైన చర్యలు చేపట్టడం లేదని, ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జల్‌పల్లి పురపాలక సంఘంలోని పలు వార్డు కూడలిలలో రోడ్డుకు సమాంతరంగా, ఓపెన్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు చాలానే ఉన్నాయని దీనిపై మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో కలిసి దిమ్మెలు నిర్మించి, ట్రాన్స్‌ఫార్మర్ లకు చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భద్రతపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.