ఓటరు ఐడీల్లో జరిగిన అవకతవకల ఆ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ సెక్రటరీతో పాటు యూఐడీఏఐ సీఈవోతో భేటీకానున్నారు. ఓటరు ఐడెంటిటీ కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలన్న అంశంపై చీఫ్ ఎలక్షన్ కమీషనర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎలక్టోరల్ డేటాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టే ఆలోచనతో ఓటరు-ఆధార్ కార్డు సీడింగ్ గురించి చర్చించనున్నారు. అయితే వాలంటరీ పద్ధతిలో ఆధార్ డేటాబేస్‌తో ఓటరు ఐడీలను సీడిరగ్ చేసే అవకాశం ఇప్పటికే ఉన్నది. కానీ అక్రమాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. ఈ ప్రక్రియను ఖచ్చితంగా పాటించే రీతిలో చర్యలు చేపడుతున్నారు. ఉడాయ్ సీఈవోను కూడా చీఫ్ ఎన్నికల అధికారి ఈ అంశంపై కలవనున్నారు. ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటరు రోల్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఓటర్ జాబితాలను మార్చేసినట్లు ఆమ్ ఆద్మీ ఆరోపించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఈసీఐ తొలగించినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.