Saturday, May 10, 2025
spot_img

కులగణను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌

Must Read
  • తెలంగాణ‌లోనూ తూతూ.. మంత్రంగా సర్వే
  • ఎవరో డిమాండ్‌ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు
  • కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి

బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మండల్‌ కమిషన్‌ నివేదికను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. జనగణనలో కులగణన చేర్చాలని సుష్మాస్వరాజ్‌ ఆనాటి ప్రధానికి లేఖ రాశారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సామాజిక వర్గం వెనకబడి ఉందో గుర్తించవచ్చు. వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు ఉపయోగ పడుతుంది. కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్‌ పార్టీ గొప్పలు చెప్పుకొంటోంది. అలాంటప్పుడు కాంగ్రెస్‌ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదు. ఇది రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డికి భయపడి తీసుకున్న నిర్ణయం కాదు. సామాజిక న్యాయానికి భాజపా కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్‌లా.. ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మోసం చేయం. తెలంగాణ, కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్‌ తూతూమంత్రంగా చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది నిజమైన కులగణన కాదు‘ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో క్యాబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు.. దేశంలో సానుకూలమైన మార్పుకు, కులగణన.. చరిత్రాత్మకమైన కులగణన, చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నాటకాలకు తెరలేపుతున్నారు.. కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. అలాగే, ముస్లింలను తీసుకెళ్లి బీసీల్లో చేర్చడం దారణం.. కాంగ్రెస్‌ అన్ని తప్పుడు నిర్ణయాలు చేసింది.. కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ రాష్ట్రపతుల అభ్యర్థిత్వాలను వ్యతిరేకించింది అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మోడీ సర్కార్‌ ఎన్నో ఏళ్ల పెండింగ్‌ అంశం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు తమ వైఖరిని స్పష్టం చేశాక.. వర్గీకరణ అంశంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మోడీనీ కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అన్నారు. కాంగ్రెస్‌ మొదటి నుంచి బీసీల పట్ల మొసలి కన్నీరే కార్చింది.. 2018లో మోడీ ప్రధాని అయ్యాక బీసీ కమిషన్‌ కు రాజ్యంగ బద్దంగా చట్టం చేశారు.. అన్ని వర్గాలకు న్యాయం చేయ్యాలని.. ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం అని కిషన్‌ రెడ్డి అన్నారు.

కాగా, మహిళల సాధికారిత కోసం 35 శాతం రిజర్వేషన్లు కల్పించామని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసి.. వాళ్లకు న్యాయం చేసింది మోడీ సర్కార్‌.. 1981 నుంచి 1931 వరకు కులగణన జరిగింది.. ఆ తర్వాత కులగణ జరక్కుండా కాంగ్రెస్‌ వ్యవహరించింది.. కులగణనకు కాంగ్రెస్‌ వ్యతిరేకం అని మండిపడ్డారు. మండలి కవిూషన్‌ నివేదికను రాజీవ్‌ గాంధీ వ్యతిరేకించారు.. 2010లోనే సుష్మాస్వరాజ్‌ కులగణన అంశాన్ని లేవనెత్తారు.. సామాజికంగా అన్ని వర్గాలకు లబ్ధి జరగాలి అని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశ హితం కోసమేనన్నారు. న్యాయ స్థానాలకు తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది.. మేం చేసే కులగణనలో మతం ప్రాతిపదికన ఏ మతాలను బీసీల్లో చేర్చేది లేదు అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తేల్చి చెప్పారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS