Saturday, May 10, 2025
spot_img

కార్మికులను ఆదుకునే బాధ్యత మాదే

Must Read
  • ఇసుక కొరత లేకుండా చేశాం
  • శ్రీసిటీ, కర్నూలుతో ఆస్పత్రుల నిర్మాణం
  • నెల్లూరు పర్యటనలో సిఎం చంద్రబాబు

కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికపై మాట్లాడారు. ఈ రోజు మే డే. ఈరోజున కార్మికులు, కష్టజీవులు గుర్తుకొస్తారు. కార్మికులను దోపిడీ చేనేకుండా అనునిత్యం వారి తరఫున పోరాడి వారికి న్యాయం చేయడానికి పునరంకితమవుతాం. మన రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు. ఇందులో వ్యవసాయంపై ఆధారపడిన వారే అధికం. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోంది. భవన నిర్మాణరంగంలో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ జెండాలో కార్మికుల కోసం చక్రాన్ని పెట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతున్నాం. కేంద్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని వల్ల సులభంగా ఇసుక దొరుకుతోంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నిర్మాణ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని కూడా రద్దు చేశా. భవనాల నిర్మాణ అనుమతులలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులో ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ పార్కులలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన భూముల సవిూకరణకు రైతులు సహకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు జాతికి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. అమరావతిలో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చు లేకుండా రాజధానిని నిర్మిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS