Saturday, May 10, 2025
spot_img

నీట్ గా పరీక్ష నిర్వహించాలి

Must Read
  • పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు
  • అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
  • ఈనెల 4న నీట్ పరీక్ష.. వికారాబాద్ లో 5 పరీక్ష కేంద్రాలు
  • మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ

నీట్ పరీక్షలు ఎలాంటి సంఘటనలకు తావునీయకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో నీట్-2025 పరీక్షకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మే 4న (ఆదివారం) నిర్వహించే నీట్ పరీక్షకు వికారాబాద్ మునిసిపల్ పరిధిలో 05 కేంద్రాలను గుర్తించడం జరిగిందని, 1193 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు తో పాటు 144 సెక్షన్ విధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్తు ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పిస్తే ఎలాంటి వస్తువులు కూడా తీసుకురాకూడదని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని త్రాగునీరు సౌకర్యాన్ని కల్పించాలని ఆయన తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ సిబ్బందిని నియమించి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు నీట్ పరీక్షకు వచ్చే అభ్యర్థులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు తెలిపారు. తీసుకోవాలని సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి కే. సాయి లత సిటి కోఆర్డినేటర్, కే. కుమ్మర స్వామిని డిప్యూటీ సిటి కోఆర్డినేటర్ గా నియామకం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏదేని సమాచార నిమిత్తం కంట్రోల్ రూం నెంబర్. 08416-235291 ఫోన్ ద్వారా శని, ఆది వారం రోజుల్లో ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల లోపు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ ట్రేని కలెక్టర్ హర్ష చౌదరి, డిఇఓ రేణుకాదేవి, ఆర్డిఓ వాసు చంద్ర, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నైమత్ అలీ, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, సిఐ భీమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS