Saturday, May 10, 2025
spot_img

భూరికార్డుల ట్యాంపరింగ్ పై స్పందించని ఆర్డీఓ

Must Read

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టనుసారంగా భూ రికార్డుల్లో పేర్లు మార్పిడి

మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామ రెవెన్యూ భూ రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టను సారంగా వ్యక్తుల పేర్లు మార్పిడి. వివరలోకి వెళితే రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామాలలో భూ రికార్డులను పట్వారిలు, రికార్డు అసిస్టెంట్ లు ప్రతి సంవత్సరం భూమి కబ్జాలో ఉన్న వారి పేరు పట్టాదారుని పేరు భూమి మొఖపై విచారణ చేసి పహానీలలో నమోదు చేయాలి. అవేవీ మాకు వర్తించవన్నట్లు కొందరు ప్రైవేట్ వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నాగిళ్ల గ్రామ భూ రికార్డులలో ఉన్న పేర్లను తొలగించి కొత్త పేర్లు నమోదు చేసుకొని భూమి ని కాజెయలని ప్రయత్నం చేస్తున్నారు.మరి కొందరు మందుముల వారసులు 180.4 ఎకరాల ఇనాం భూమి పై అక్రమంగా రికార్డు లలో పేర్లను నమోదు చేసుకొని ఐదు సంవత్సరల క్రితం రైతులు కబ్జాలో ఉండి జీవన ఉపాధి పొందుతున్న భూములపై ఓ ఆర్ సి తెచ్చుకున్నారు. ఒకే నెంబర్ తో డీ ఆర్ బుక్ లో ఇద్దరు పేర్లపై అదే నెంబర్ నమోదు చేశారు.గత రెండు సంవత్సరాల నుండి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కి ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన రైతులు భూ రికార్డు లు మార్పిడి పై ఫిర్యాదులు చేసిన స్పందన కరువైంది. 180.4 ఎకరాల ఇనాం భూమిపై ఉన్న ప్రేమ ఆర్డిఓ అనంతరెడ్డికి రైతులు భూ రికార్డు లు ట్యాంపర్ జరిగావని మొరపెట్టుకున్న విచారణ జరపడానికి వెనకడుగు వెయ్యడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నావని రైతులు తెలిపారు. ఆధారాలు చూపిస్తూ పలు దినపత్రికలలో వార్తలు ప్రచురించిన వివరణ ఇవ్వడానికి ఆర్డీఓ కి ఎందుకు అంత భయం. కోట్ల రూపాయలు విలువ చేసే భూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగవని రైతులు ఆందోళన చెందుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం మాకేంటి సంబంధం అన్నట్లు వ్య వహరిస్తున్నారు. భూ రికార్డుల ట్యాంపరింగ్ పై ఆర్డీఓ స్పందించి నింధుతుల పై చర్యలు తీసుకోకపోతే రైతులందరూ కలిసి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS