Saturday, May 10, 2025
spot_img

శ్రీసిటీలో ఎల్జీ ఎలక్టాన్రిక్సిక్‌ శంకుస్థాపన

Must Read
  • ఆవిష్కరణలు పెట్టుబడులతో భవిష్యత్‌కు బాటలు
  • కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ వెల్లడి

ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్టాన్రిక్సిక్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్టాన్రిక్సిక్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు బాటలు వేస్తున్నామన్నారు. ఈరోజు ఎల్జీ యూనిట్‌కు మాత్రమే కాదు.. ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు కంటే పెద్దది. ఇది రాష్ట్రంతో పాటు- దేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడితో రాష్ట్రానికి ప్రపంచస్థాయి తయారీ యూనిట్‌ను ఎల్జీ తీసుకొచ్చింది. ’మేడ్‌ ఇన్‌ ఆంధ్రా నుంచి మేడ్‌ ఫర్‌ ది వరల్డ్‌’ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుందని లోకేశ్‌ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా శ్రీసిటీ- యూనిట్‌లో ఎల్జీ ఆవిష్కృతమైంది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు, ఏపీ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. సులభతరమైన వ్యాపారానికి హావిూ ఇవ్వడంతో పాటు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాలను అనుసరిస్తున్నామని లోకేశ్‌ అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్‌ ఇగురువారం పర్యటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్‌ ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రూ. 839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.

ఎల్జీ ఎలక్టాన్రిక్సిక్‌ కంపెనీకి భూమి పూజ చేయడంతో 20 లక్షల ఉద్యోగాల లక్ష్‌యాన్ని చేరుకునే దిశగా రాష్ట్రంలో మరో అడుగు పడిరది. రూ. 5,001 కోట్ల పెట్టుబడిలో భాగంగా 2 వేల ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఎల్జీ తమ సంస్థలు ఏర్పాటు- చేయడంతో ఇక్కడ ఎల్జీ సిటీ ఏర్పడనుందని లోకేశ్‌ అన్నారు. విదేశీ సంస్థల ప్రతినిధుల రాకపోకలకు రాబోయే నాలుగు సంవత్సరాల్లో తిరుపతికి అంతర్జాతీయ విమానయానం పెరిగేలా చేస్తామని చెప్పారు. పరిశ్రమలు తీసుకు రావటానికి మంత్రులు, కలెక్టర్లు మాత్రమే కాదని..ప్రతి నియోజక వర్గం మరో నియోజక వర్గంతో పోటీ పడాలని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు-కు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఎల్జీ సంస్థ రూ.5000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ఆంధప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు పెట్టే నమ్మకాన్ని తెచ్చిందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్‌ పర్యటిస్తున్న నేపథ్యంలో ముందస్తు అనుమతితో కేబినెట్‌కు రావడం లేదని సమాచారం ఇచ్చారు. శుక్రవారం సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేబినెట్‌ సమావేశానికి మరో మంత్రి పయ్యావుల కేశవ్‌ హాజరు కాలేదు. విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా కేబినెట్ భేటీకి మరో మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ హాజరుకాలేదు. ఈ మేరకు మంత్రులు ముందస్తు అనుమతి పొందారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS