ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ మూవీ ఫైర్ గ్లింప్స్ విడుదలయ్యాయి. యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ ఫైర్ గ్లింప్స్ అదిరిపోయాయి.
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఎమోషనల్‌గా గ్లింప్స్ ప్రారంభమవుతాయి. సానుభూతితో నిండిన వాయిస్‌లో అడవి శేష్.. ఆమెను “జూలియట్” అని పిలుస్తాడు. అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు. కానీ.. వెంటనే అతని వాయిస్ మారిపోతుంది. నేను నిన్ను మోసగించడానికి రాలేదు.. అంతకన్నా ఎక్కువ చేస్తా అని మిస్టీరియస్ స్మైల్‌తో అడవి శేష్ చెప్పే డైలాగ్ సూపర్ అనిపిస్తుంది.
నెక్‌స్ట్ ఎపిసోడ్‌లో ఖైదీ యూనిఫాంలో జైలు వ్యాన్‌లో ఉన్న అడవి శేష్.. కూల్‌గా తన నోటి నుంచి ఒక కీని బయటకు తెస్తాడు. తర్వాత ఓ రైలు.. వ్యాన్ మీదుగా దూసుకెళ్తుంది. చివరి సన్నివేశంలో మృణాల్ అతని పక్కన కూర్చుంటుంది. అడవి శేష్ ఫైరింగ్ చేస్తాడు. ప్రేమ, ప్రతీకారం, మోసంతో నిండిన ఓ గొప్ప కథకు ఇది నాంది.

విజువల్‌గా డకాయిట్ ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. అడివి శేష్ ఇంటెన్స్ అండ్ రగ్గడ్ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. మదనపల్లె యాసలో అదరగొట్టాడు. అతని వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి. హిందీ వెర్షన్‌కు కూడా అడవి శేషే డబ్బింగ్ చెప్పారు. అది కూడా వండర్‌ఫుల్‌గా వచ్చింది.
మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆమె పాత్ర వెనక కథ చాలా ఆసక్తి కలిగిస్తుంది. అనురాగ్ కశ్యప్ ప్రజెన్స్ ప్రభావవంతంగా ఉంది.
దర్శకుడు షానియల్ డియో విజువల్ ప్రజెంటేషన్‌తో శెభాష్ అనిపించుకున్నాడు. సినిమా స్కేల్ ఎంత బిగ్గర్‌గా ఉంటుందో ఈ టీజర్ తెలిపింది. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేసింది.

సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన డెకాయిట్ మూవీ గొప్ప థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోందని ‘ఫైర్’ గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది.
డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తొందనటంలో ఎలాంటి సందేహం లేదు. అడవి శేష్‌కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం.